ముఖ్యమంత్రి గారు... ఉపాధి కల్పన అంటే ఒకరి ఉద్యోగం పీకేసీ..మరోకరి ఇవ్వడమా ? - చంద్రబాబు
ఉపాధి కల్పన అంశాన్ని ప్రస్తావిస్తూ ఏపీ సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
వైసీపీ ప్రభుత్వ విధనాలకు నిరంతం ఎండగడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ..తాజాగా నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగులకు జగన్ హామీ ఇచ్చారు.. దాన్ని నిలబెట్టుకునేందకు వింత విధానాలను అమలు చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవ చేశారు.
ఇదేనా ఉపాధికల్పన అంటే..?
సీఎం జగన్ తన అనుచిత విధానాలతో విధానాలతో నిన్న ఆశాకార్యకర్తలను... ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లను ఇబ్బందుల పాల్జేస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దృష్టిలో ఉపాధి కల్పన అంటే ఒకరి ఉద్యోగం పీకేసీ..మరోకరి ఇవ్వడమా ? అని చ్ంద్రబాబు ప్రశ్నించారు.
చిరు ఉద్యోగుల ఉసురు పోసుకోవద్దు...
కొత్తగా ఉద్యోగాల కల్పన చేసే సామర్థ్యం లేనప్పుడు ఉద్యోగాల హామీ ఇవ్వడం ఎందుకుని ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న అనుచిత విధానాలు చిరు ఉద్యోగులకు పాలిట శాపంగా మారాయని.. జగన్ సర్కార్ చిరు ఉద్యోగుల ఉసురు పోసుకుంటోందంటూ చంద్రబాబు మండిపడ్డారు.