Chandrababu: రాష్ట్రపతి ఎన్నికల్లో తన స్టాండ్‌ను టీడీపీ ప్రకటించింది. ఈఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని  ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో అధికారికంగా ప్రకటించారు. సామాజిక న్యాయానికే తొలి నుంచి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే దళిత నేతకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ సైతం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. దీంతో ఈఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు ఎన్డీయే అభ్యర్థికి టీడీపీ మద్దతు తెలపడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. 2017 తర్వాత ఎన్డీయే నుంచి ఆ పార్టీ బయటకు వచ్చింది. ఆతర్వాత బీజేపీకి దూరంగా ఉంటూ వస్తోంది.


2019 ఎన్నికల తర్వాత టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు..బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీసేందుకు విపక్షాలన్నీ ఏకమవుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. మరోసారి టీడీపీ,బీజేపీ,జనసేన కలిసి పోటీ చేస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో చంద్రబాబు నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది.


 


Also read:Bandi Sanjay on CM Kcr: టీఆర్ఎస్‌కు ప్రజాగ్రహం తప్పదు..సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్..!


Also read:Indrakeeladri: ఇంద్రకీలాద్రిపైకి వాహనాలకు నో ఎంట్రీ..దుర్గగుడి ఈవో కీలక నిర్ణయం..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook