AP new districts: ఏపీలో కొత్త జిల్లాల పునర్విభజన తర్వాత పలు.. విషయాల్లో వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల పేర్ల విషయంలో ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్తగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు.. స్థానికంగా మహానేతగా పేరున్న వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై టీటీపీ పొలిట్​బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడుతూ.. వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్​తో ఉద్యమిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రేపు (బుధవారం) ధర్నా చౌక్​ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడికీ సిద్ధమని వెల్లడించారు. ఆయన పేరును పెట్టకుంటే.. ప్రభుత్వం ఆయనను అవమానించినట్లేనన్నారు.


విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాలో వంగ వీటి మోహన రంగా విగ్రహం లేని ప్రాంతం లేదని బోండా ఉమా పేర్కొన్నారు. వంగవీటి రంగe పేదల కోసం నిరాహార దీక్ష చేస్తూ.. ప్రాణాలు అర్పించారని గుర్తు చేసుకున్నారు. అందుకే అలాంటి మహానేత పేరు పెట్టకుంటే సీఎం జగన్​ చరిత్ర హీనులవుతారన్నారు. రంగా పేరు పెట్టేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు కూడా కాదని వెల్లడించారు.


తూర్పు కృష్ణకు ఎన్టీఆర్ పేరు..


కొత్త జిల్లాల ప్రకటన తర్వాత నుంచి తాము.. ఈ డిమాండ్ చేస్తున్నా కనీసం స్పందన లేదని మండిపడ్డారు బొండా ఉమా. ప్రభుత్వం వెంటనే స్పందించి.. తూర్పు కృష్ణకు ఎన్టీఆర్ పేరు, విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.


ఆడ్డగోలుగా జిల్లాల కొత్త వ్యవహారం..


జిల్లాల విభజనపై తమ సొంత పార్టీ వ్వహారంలా నిర్ణయం తీసుకుందని బొండా ఉప ప్రభుత్వాన్ని విమర్శించారు. జిల్లాల పునర్విభజన కోసం ఎవరి సలహాలు తీసుకోలేదన్నారు. 13 జిల్లాల్లో స్థానికంగా అనేక మంది మహానేతలు ఉన్నారని.. వారి పేర్లను అక్కడి జిల్లాల పేర్ల కోసం పరిశీలించలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అందరితో చర్చించి.. స్థానికంగా ఉండే నేతల పేర్లు పెట్టాలన్నారు.


అసలు నాని క్యాసినో వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల అంశాన్ని ప్రభుత్వం ఇప్పుడు తెరపైకి తెచ్చినట్లు ఆరోపణలు చేశారు టీపీడీ నేత. 


Also read: Jagananna Chododu scheme: నేడు 'జగనన్న చేదోడు' నిధులు విడుదల.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.10వేలు వేయనున్న సీఎం జగన్..


Also read: Nellore Police: మహిళా పోలీసుల యూనిఫాం కొలతలకు జెంట్స్‌ టైలర్‌.. నెల్లూరు పోలీసుల తీరుపై విమర్శలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook