Devineni Uma Comments: జగన్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. నిర్వాసితులకు అందించాల్సిన సొమ్ములో అవకతవకలు జరిగాయని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన డబ్బులను ప్రభుత్వ పెద్దలు మింగేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ డైరక్షన్‌లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. త్వరలో సీఎం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలవరం స్కామ్‌లో స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీతోపాటు ఎమ్మెల్సీ అనంతబాబు హస్తం ఉందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని..సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. దీనిని సీఎం జగన్‌ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసేందుకు కేసీఆర్‌ను సొమ్మును తెచ్చుకున్నారని మండిపడ్డారు.


సీఎఫ్‌ఎంఎస్‌(CFMS) నుంచి ఆఫ్‌లైన్ పేమెంట్లు జరుగుతున్నాయని విమర్శించారు. సీఎఫ్‌ఎంఎస్ లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిగితే సీఎం జగన్ జైలుకు వెళ్తారన్నారు. రూ.లక్ష కోట్ల బిల్లులు చెల్లిస్తే అందులో సజ్జలకు రూ.20 వేల కోట్ల చేరుతున్నాయన్నారు దేవినేని ఉమ. సీఎఫ్‌ఎంఎస్ విధానాన్ని సీఎం జగన్ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాగ్‌ చెబుతున్న వివరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


Also read: Etela Rajender Comments: కేంద్ర నిధులపై తెలంగాణలో రగడ..మంత్రి కేటీఆర్‌కు ఈటల కౌంటర్..!


Also read:Samantha - Naga Chaitanya: నాగ చైతన్య కోసం.. స్టార్‌ హీరో సినిమా వదులుకున్న సమంత!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook