ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుకున్నది సాధించింది. తాము సత్తా చాటిన ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల ఏపీలో జరిగిన పురపాలక, నగరపాలక ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అయితే అనంతరంపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలు మినహా అన్ని మున్సిపాలిటీలలోనూ వైఎస్సార్‌సీపీ విజయదుందుబి మోగించింది. అయితే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సత్తా చాటిన మున్సిపాలిటీ తాడిపత్రి చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ఎన్నికయ్యారు.


Also Read: TDP Chief Chandrababu: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు AP CID నోటీసులు


తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులుండగా, ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ 2 వార్డులు ఏకగ్రీవం(Tadipatri Municipal Chairman Election) చేసుకుంది. మిగిలిన 34 వార్డులలో వైఎస్సార్‌సీపీ 14, టీడీపీ 18, సీసీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో వార్డులో గెలుపొందారు. టీడీపీకి సీపీఐ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. అధికార వైఎస్సార్‌సీపీ సైతం ఈ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందకు శతవిధాలా ప్రయత్నించింది.


Also Read: Tadipatri Municipal Chairman Election: ఉత్కంఠగా మారిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, MLC ఓట్లు చెల్లవట


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook