Telugu Desam Party :ఆ టీడీపీ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు,ఆరా తీస్తున్న చంద్రబాబు
Telugu Desam Party : ఏపీలో కొందరి నేతలు తీరు ఎందుకు తీవ్ర చర్చనీయాంశంగా మారింది..?అధికారంలో ఉన్నా ఎందుకు ఆ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు...? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పై అంతెత్తున ఎగిరిపడిన నేతలు ఇప్పుడు ఎందుకు దూకుడు తగ్గించారు..? అందులోను చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన నేతలు ఎందుకు కాముష్ గా ఉంటున్నారు ..?
Telugu Desam Party : ఏపీలో రాజకీయాల్లో వాళ్లు ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్లు..అలాంటిది ఈ మధ్య కాలంలో వారు పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు.ఏళ్లుగా టీడీపీకీ , సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెదులుతూ వస్తున్నారు. అలాంటి నేతలు ఈ మధ్య చాలా సైలెంట్ గా మారారని టీడీపీ,కూటమిలో తెగ ప్రచారం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ వీళ్లు ఇలా లేరని ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై ఈగ వాలకుండా చూసుకున్న నేతల్లో కొందరు ఇప్పుడు పెద్దగా నోరు విప్పడం లేదట. గతంలో వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ పై ప్రతి చిన్న విషయంలో ఘాటుగా స్పందించేవారిన వారికి పేరుంది. అలాంటిది కొన్నాళ్లుగా ఈ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా మారారని పార్టీలో ప్రచారం జరుగుతుంది.
ఇటీవల విజయవాడ వరదలు, తిరుమల లడ్డు విషయంలో పార్టీలోని కీలక నేతలు పెద్దగా స్పందించలేదని విమర్శలు వినపడుతున్నాయి. ఒక వైపు జగన్, వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే అధికారంలో ఉండి కూడా నేతలు కౌంటర్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మొన్నటి విజయవాడ వరదల నుంచి నిన్నటి తిరుమల లడ్డు అంశంలో కూడా ఒకరిద్దరు నేతలు మినహా మిగితా వారు కూడా పెద్దగా స్పందించలేదని పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిలో ఉందని సమాచారం. ఎంత సేపు అన్ని విషయాల్లో చంద్రబాబు మినహా ఎవరూ స్పందించకపోవడంపై కూడా పార్టీ శ్రేణుల్లో ఒకింత ఆసక్తికర చర్చ జరగుతుంది.
అయితే ఎందుకు నేతలు ఇలా మౌనవ్రతం పట్టారని టీడీపీ పెద్దలు ఆరా తీస్తున్నారట. ఒకప్పుడు ఒకరిని మించి ఒకరు ప్రెస్ మీట్ లు పెట్టి జగన్ ను విమర్శించిన నేతలు ఉన్నంట్లుండి సైలెంట్ గా మారడం ఏంటా అని తెలుసుకునే ప్రయత్నంలో అధిష్టానం ఉందని ఏపీ టీడీపీలో చర్చ జరగుతుంది. నేతలు మునపటిలా ఎందుకు పార్టీలో యాక్టివ్ గా లేరని తెలుసుకునే ప్రయత్నం చేస్తుందంట. అసలే అధికారంలో ఉన్నాం. పార్టీ పరంగానో, ప్రభుత్వపరంగానో పదవులు వచ్చే అవకాశం ఉంది. ఐనా ఈ నేతలు ఎందుకు సైలెంట్ ఉంటున్నారబ్బా అని తెగ ఆందోళన చెందుతున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మినహా మిగితా నేతలు ఎవరూ కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఇటు ప్రభుత్వ పరంగానైనా, అటు పార్టీ పరంగానైనా ఈ ఇద్దరు నేతలు మాత్రమే అన్ని అంశాలపై స్పందించాల్సి వస్తుంది.
ఒకవైపు చంద్రబాబు ఏపీనీ గాడిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాజకీయంగా వస్తున్న విమర్శల విషయంలో పార్టీలోని కీలక నేతలు పట్టీపట్టనట్లు ఉండడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా చంద్రబాబే చూసుకోవాల్సి వస్తుండడంతో బాబుపై పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంటుందని పార్టీలో చర్చ. 75 ఏళ్ల వయస్సులో కూడా చంద్రబాబు తెగ కష్టపడిపోతుంటే కొందరు నేతల బాబుకు సహకారం అందించాల్సి పోయి సైలెంట్ గా ఉండడం సబబు కాదనేది పార్టీ శ్రేణుల్లో వినపడుతున్న మాట.
ముఖ్యంగా విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో చంద్రబాబు ఒక్కడే వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు అండగా నిలిచారు. అదే సమయంలో ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో టీడీపీ పూర్తిగా విఫలమైందనే ప్రచారం జరిగింది. వరదలతో రాజధాని అమరావతి మునిగిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే దానిని కౌంటర్ చేయాల్సిన నేతలు నోరు తెరవకపోవడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కనీసం అమరావతి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సరిగ్గా స్పందించలేదనే చర్చ పార్టీలో వినబడింది. ఇది ఇలా ఉండగానే తాజాగా తిరుమల లడ్డు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే అలాంటి తిరుమల లడ్డు విషయంలో కూడా కొందరు నేతలు మిన్నకుండి పోయారని పార్టీ క్యాడర్ మండిపడుతోంది.
అసలే ప్రజలు కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారు. అలాంటి తరుణంలో చంద్రబాబుకు మద్దతుగా ఉండాల్సిన పార్టీ నేతలు ఇలా చేయడం ఏంటనే విమర్శలు ఉన్నాయి. పార్టీ ఇచ్చే పదవులు అనుభవించుకుంటూ ఉంటే సరిపోదు. పార్టీపైనా, సీఎం చంద్రబాబుపై వస్తున్న విమర్శలను కూడా తిప్పొకొట్టకపోతే మీకు ఆ పదవులు ఎందుకని క్యాడర్ ప్రశ్నిస్తుంది. ఇక నుంచి నేతల తీరు మార్చుకొని చంద్రబాబుకు అండగా ఉండాలని పార్టీ క్యాడర్ కోరుకుంటుంది. మున్ముందు కూటమి ప్రభుత్వానికి ,టీడీపీకీ మరిన్ని సవాళ్లు వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ నేతలు అందరూ యాక్టివ్ గా ఉండాలని లేకుంటే పార్టీకీ ఇబ్బందులు తప్పవని టీడీపీ క్యాడర్ హెచ్చరిస్తుంది.
మొత్తానికి కొందరు టీడీపీ నేతల వ్యవహారం ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పార్టీనీ,ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు అనుకుంటుంటే పార్టీ నేతలు మాత్రం ఎంచక్కా తమ కేమీ పట్టనట్టు ఉండిపోతున్నారు.మరి ఇలాంటి నేతలను టీడీపీ ఏం చేయబోతుంది..మళ్లీ ఆ నేతలు యాక్టివ్ మోడ్ లోకి వస్తారా లేక ఎప్పటిలాగే గప్ చుప్ గా ఉండిపోతారా అనేది భవిష్యత్తులో తేలనుంది.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter