చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో ఇదే
చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో ఇదే
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరో ఐదారు రోజులే మిగిలివున్న నేపథ్యంలో ఇవాళ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. అమరావతిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో 'మీ భవిష్యత్.. నా బాధ్యత' అనే పేరుతో చంద్రబాబు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
టీడీపీ మేనిఫెస్టోలో వున్న ముఖ్యాంశాలు ఇలా వున్నాయి :
ప్రతీ ఏటా అన్నదాత సుఖీభవ కార్యక్రమం
రైతులకు వడ్డీలేని రుణాలు
వ్యవసాయాన్ని ఉపాధిహామీకి అనుసంధానం
రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
ప్రతీ మండలం, పట్టణాల్లో చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కులు
వైద్యంలో రూ.5లక్షల వరకు ఉచితం సాయం
కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ అభివృద్ధి
విదేశీ విద్య కోసం పేద విద్యార్థులకు రూ. 20 లక్షలు
ఇంటర్మీడియెట్ నుంచి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణి
మాదిగలు, రెల్లి, యానాది కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు
ఆదివాసీల కోసం ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు
ఐదేళ్లలో రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా పరిష్కారం
మత్స్యకారుల క్రాప్ హాలిడేకి రూ.10 వేలు సాయం
వడ్డెర, బ్రాహ్మణ వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు
2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యం
విద్యుత్ వాహనాలను ప్రమోట్ చేస్తాం
ప్రతి గ్రామం నుంచి మెయిన్‌రోడ్డుకు బీటీ రోడ్డు వేస్తాం
పట్టణాల్లో తోపుడుబండ్లకు ఇబ్బంది లేకుండా చేస్తాం
తిరుపతికి ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు
విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు