TDP MLA Ganta Srinivasarao: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) మళ్లీ యాక్టివ్ అయ్యారు. అసెంబ్లీ సభ్యత్వానికి తాను సమర్పించిన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాంకి (Tammineni Sitharam) లేఖ రాశారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న తన శాసన సభ్యత్వానికి  రాజీనామా చేశారు. దీనిపైనే తాజాగా స్పీకర్ తమ్మినేనికి లేఖ రాశారు గంటా శ్రీనివాసరావు. ఏడాది దాటినా తన రాజీనామాను ఆమోదించకపోవడంపై ఆవేదన చెందుతున్నట్లు లేఖలో గంటా పేర్కొన్నారు. ఏడాదికాలంగా పోరాడుతోన్న నిర్వాసితుల, కార్మికుల పోరాటాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధను కలిగించిందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని గంటా ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాది ఫిబ్రవరి 21న గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. మొదట ఆయన స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయలేదు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేశారు. స్పీకర్ ను కలిసి లేఖ సమర్పించారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని ఆయన అప్పట్లో ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా పోరాటం చేస్తానన్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని సైతం అప్పట్లో గంటా పిలుపునిచ్చారు.


ఇప్పటి వరకు రాజీనామా ఆమోదించి కపోవడం సరైంది కాదనీ.. నా రాజీనామా ఉద్యమానికి బలం చేకూరుతుందని తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని తాజా లేఖలో కోరారు గంటా శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని నా రాజీనామా కార్మిక సోదరులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తాజాగా గంటా రాసిన లేఖపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.


Also Read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై హైకోర్టులో నేడు విచారణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook