అమరావతి : ఏపీ సర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటీవల ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించడం, సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేయడం, రాష్ట్రధాని రాజధానిని అమరావతి నుంచి తరలించడం, మూడు రాజధానుల ఏర్పాటు తదితర అంశాలపై కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేసే లక్ష్యంతో టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ బాటపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించుకున్నారు. 


ఈ సందర్భంగా రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని నిరసిస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలను సైతం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని తెలుగు తమ్ముళ్లు నిర్ణయించుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..