టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు షాక్ ఇచ్చిన వాట్సాప్ !
టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు షాక్ ఇచ్చిన వాట్సాప్ !
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ నెంబర్ పై నిషేధం విధించి ఆయకు వాట్సప్ సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. అభ్యంతరకర సందేశాలు పంపుతున్నారని తమకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయన వాట్సాప్ ఎకౌంట్‌ను నిషేదించినట్టు వాట్సాప్ ప్రకటించింది. తన వాట్సప్ నెంబర్ పనిచేయటం లేదని మెయిల్ ద్వారా వాట్సాప్ సంస్థకు ఫిర్యాదు చేసిన ఎంపీ సీఎం రమేష్... తన ఖాతాను పునరుద్ధరించాల్సిందిగా ఆ సంస్థను కోరారు. దీంతో ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదుపై స్పందించిన వాట్సప్ సంస్థ.. సదరు వాట్సాప్ నెంబర్ ద్వారా తమకు అభ్యంతరకరమైన సందేశాలు వస్తున్నాయని పలువురు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందాయని, అందువల్లే ఆ నెంబర్‌ను నిషేధించడం జరిగిందని వివరణ ఇచ్చింది.
ఇంకొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీ సీఎం రమేష్‌కు వాట్సాప్ ఇలా షాకివ్వడం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. ఎన్నికల ప్రచారంలో వేగంగా సందేశాలు చేరవేస్తూ తమ వాణిని ఓటర్ల వద్దకు తీసుకెళ్లడంతో కీలక అస్త్రంగా మారుతుందనుకున్న వాట్సాప్ నుంచి ఇలాంటి పరిణామం ఎదురవడం రాజకీయ నాయకులను సైతం ఆలోచనలో పడేసింది.