చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై జేసీ దివాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు !
చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై జేసీ దివాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు !
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీకి చెందిన శాసనసభ్యులపై అదే పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని చెబుతూ 40% మంది ఎమ్మెల్యేలను మార్చకపోతే ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమేనని సందేహాలు వ్యక్తంచేశారు. చంద్రబాబు విషయంలో సైతం తనకు పలు అభ్యంతరాలు ఉన్నాయని జేసీ దివాకర్ రెడ్డి మరో బాంబు పేల్చారు. అవతలి వ్యక్తి ఎవరైనా వారి గురించి తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారనే సంగతి తెలిసిందే. అలాగే తాజాగా తాను కొనసాగుతున్న పార్టీ అధ్యక్షుడిపైనే తన అసంతృప్తిని వెళ్లగక్కి తానేంటో మరోసారి నిరూపించుకున్నారు.
భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులపై జేసి దివాకర్ రెడ్డి స్పందిస్తూ.. ''సరిహద్దుల్లో పరిస్థితులు ఇలానే కొనసాగితే, రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవడం ఖాయం అని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.