TDP MP కేశినేని నానికి కరోనా పాజిటివ్, వ్యాక్సిన్ తీసుకున్న వారంలోపే COVID-19
Kesineni Nani Tests Positive For COVID-19 | ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా సోకింది. ఆయన ఇటీవల కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. వారం రోజులవ్యవధిలో ఆయనకు కరోనా సోకడం గమనార్హం.
Kesineni Nani Latest News | కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో భారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్19 మరణాలు సైతం భారీగా పెరిగిపోతున్నాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా సోకింది. ఆయన ఇటీవల కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. వారం రోజులవ్యవధిలో ఆయనకు కరోనా సోకడం గమనార్హం.
గత ఏడాది కరోనా వ్యాప్తి మొదలైన అనంతరం పలువురు నేతలు కోవిడ్19 బారిన పడ్డారు. చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నారు. తాజాగా ఈ జాబితాలో టీడీపీ ఎంపీ కేశినేని నాని చేరారు. తనకు కరోనా పాజిటివ్ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘ డియర్ ఆల్, నాకు కరోనా(CoronaVirus) పాజిటివ్ అని ఈరోజు తేలింది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. నాకు నేను సొంతంగా హోం క్వారంటైన్‌కు వెళ్తున్నాను. మా ఇంట్లోనే కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను నేరుగా కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోండి, వీలైతే ఐసోలేషన్‌కు వెళ్లాలని’ టీడీపీ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) తన ట్వీట్ ద్వారా కోరారు.
Also Read: 7th Pay Commission: ఉద్యోగుల పనివేళలు 12 గంటలకు, కానీ టేక్ హోమ్ శాలరీ తగ్గింపు
కాగా, ఏపీలో కరోనా వైరస్ కేసులు రెండో దశలో భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో కొత్తగా 5,086 కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 9,42,135కు చేరగా, కోవిడ్19 మరణాలు 7,353కి చేరింది. ఓవైపు కరోనా టీకాల పంపిణీ వేగంగా కొనసాగిస్తున్న ఏపీ సర్కార్ మరోవైపు కోవిడ్19(COVID-19) నిర్దారణ పరీక్షలను భారీ సంఖ్యలో నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook