Chandrababu on Police: పోలీసులా..వైసీపీ కార్యకర్తలా..తాము వచ్చాక తాట తీస్తామన్న చంద్రబాబు..!
Chandrababu on Police: చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసులు దౌర్జన్యాన్ని పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది.
Chandrababu on Police: చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసులు దౌర్జన్యాన్ని పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వమే టార్గెట్‌గా టీడీపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎవరి అండ చూసుకుని పోలీసులు ఇలా రెచ్చిపోతున్నారని ప్రశ్నించారు.
వైసీపీ కార్యకర్తల్లా మారి ప్రవర్తిస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ ఘటనపై పార్టీ తరపున న్యాయం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే గాడి తప్పిన వ్యవస్థను సరిచేస్తామని..ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం జగన్ మెప్పు కోసం పోలీసులు ఇలా చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. హత్య కేసులో విచారణపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.
చిత్తూరు జిల్లాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ మేయర్, నగర టీడీపీ అధ్యక్షురాలు కఠారి హేమలత తనుచరుడు పూర్ణ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఇంట్లో గంజాయి ఉందనే సమాచారం వచ్చిందని..అందుకే వచ్చామని పోలీసులు తెలిపారు. అక్కడికి చేరుకున్న హేమలత..పోలీసులతో వాదించారు. పోలీస్ జీపు ముందు అనుచరులతో బైఠాయించారు.
టీడీపీ నేత హేమలత, ఆమె అనుచరులు అక్కడి నుంచి కదలకపోవడంతో పోలీసులు వారిపై నుంచి జీపు ఎక్కించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం హేమలత, ఆమె అనుచరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హేమలత రెండు కాళ్లు విరిగిపోయినట్లు తెలుస్తోంది. ఐతే పోలీసులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. తాము న్యాయ బద్ధంగా తనిఖీలు చేశామని..ఇంట్లో గంజాయి దొరికిందని అంటున్నారు. టీడీపీ నేతలే కావాలనే రెచ్చగొట్టారని ఆరోపిస్తున్నారు.
Also read:Chor Bazaar Review : ఆకాష్ పూరి 'చోర్ బజార్' రివ్యూ.. ఎలా ఉందంటే?
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వేగంగా నైరుతి గాలులు..ఇవాళ్టి వెదర్ రిపోర్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.