Chandrababu Naidu: దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా ఈనెల 4న భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఇందుకు ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. ఈక్రమంలో ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాష్‌ బిర్లాకు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా పార్లమెంట్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత స్వాతంత్ర్య 75వ వసంతాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరి సీతరామరాజును స్మరించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని లేఖలో చంద్రబాబు అన్నారు. ఈనెల 4న భీమవరంలో జరగబోయే అల్లూరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రజల మనసుల్లో గుర్తిండిపోతుందని చెప్పారు. అదే సమయంలో ఈఏడాదే అల్లూరి 125వ జయంతి వేడుకలు ఉండటం ఆనందాయకమన్నారు. 


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ల్లో అల్లూరి విగ్రహం ఆవిష్కరించాలని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం సీతారామ రాజు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారని లేఖలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అలాంటి అల్లూరికి సముచిత స్థానం కల్పించాలని లేఖలో కోరారు. గతంలోనే పార్లమెంట్‌ హాల్‌లో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని..ఐతే ఎన్నికలు రావడం ప్రభుత్వాలు మారడంతో విగ్రహ ఏర్పాటు ఆలస్యమయ్యిందన్నారు. 


తదుపరి ఎలాంటి జాప్యం లేకుండా అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలని లేఖలో ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాష్‌ బిర్లాను చంద్రబాబు కోరారు. అల్లూరిని సత్కరించుకోవడం అంటే దేశ స్ఫూర్తిని గిరిజన జాతులను గౌరవించుకోవడమేనన్నారు.


Also read:Rain Alert: ప్రధాని మోడీ సభకు గండం! తెలంగాణకు మూడు రోజుల రెయిన్ అలర్ట్..


Also read:CM Kcr on PM Modi: ప్రధానిలా కాకుండా సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారు..మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook