TDP Alliance with BJP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ బయలుదేరారు. ఈరోజు రాత్రికి ఢిల్లిలోని బీజేపీ నేతలతో భేటీ అయి పొత్తులపై చర్చించనున్నారు. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తుపై తమ స్టాండ్‌ని ప్రకటించి ఏపీలో ఉమ్మడిగా ప్రచారాలు కూడా మొదలుపెట్టాయి. జనసేన బీజేపీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో టీడీపీ కూడా బీజేపీతో పొత్తుపై చర్చలు జరిపి ఓ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  Vishnu Idol: కృష్ణా నదిలో ప్రత్యక్షమైన దేవతా మూర్తులు.. అయోధ్య రాముడి రూపంలో శ్రీమహావిష్ణువు, శివలింగం


రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాలపై రెండు రోజుల క్రితం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో పవన్ కళ్యాణ్ భేటి అయ్యారు. పొత్తులో భాగంగా జనసేనకి కేటాయించిన అసెంబ్లీ సీట్లపై కొన్ని అభ్యంతరాలు చంద్రబాబు నాయుడి దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లినట్లు సమాచారం. జనసేనకి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కావాలని చంద్రబాబునాయుడిని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దానికి టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జనసేన మాత్రం ప్రతి ఎంపీ సీటులో ఒక అసెంబ్లీ సీటు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. సీట్ల కేటాయింపుపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 


ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. 2014 నుంచి 2019 వరకు బీజేపీ పార్టీతో పొత్తులో వున్న టీడీపీ, 2019 ఎన్నికలకు ముందు బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్నికి అన్యాయం చేసిందని పొత్తును రద్దు చేసుకుని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయింది టీడీపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నికి రావాల్సిన నిధుల విషయంలో బాహాటంగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్ళలు చేశారు చంద్రబాబు. తిరుపతిలో అమిత్‌ షా పర్యటన సందర్భంలో టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి కూడా చేశారు. ఆ ఘటన తర్వాత బీజేపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి ఇరు పార్టీలు వెళ్లాయి. 


టీడీపీతో పొత్తుకు బీజేపీ ఓకే అంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయా లేదా అనే సందేహం ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేనకి అసెంబ్లీ సీట్ల విషయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయని తెలుస్తోంది. ఆ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కుదిరితే అసెంబ్లీ స్థానాల విషయంలో తీవ్ర ఘర్షణలు జరిగే అవకాశం లేకపోలేదు. వైసీపీతో సఖ్యతతో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీతో పొత్తుకు సుముఖత వ్యక్తం చేస్తుందా లేదా వేచి చూడాలి. 


Also Read: Dil Raju: రేవంత్ రెడ్డి దగ్గరికి దిల్ రాజు.. ఆశిష్ పెళ్లికార్డ్ అందజేసిన ఫ్యామిలీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి