Telangana TDP: తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ.. ఏ పార్టీకీ ఎగ్జిట్ ..? చంద్రబాబు వ్యూహం అదేనా..!
Telangana TDP: చంద్రబాబు హైదరాబాద్ గ్రాండ్ ఎంట్రీ తర్వాత ఇక్కడ రాజకీయాల్లో కూడా మళ్లీ యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తున్నారా అంటే ఔనన అంటున్నాయి. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో తెలుగు దేశం ఎంట్రీ ఇస్తే.. ఏ పార్టీకి ఎగ్జిట్ కానుంది.
Telangana TDP: ఏపీలో గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత చంద్రబాబు తెలంగాణలో కూడా స్పీడ్ పెంచాడు. మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఆలోచించిన పార్టీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో తెలంగాణ టీడీపీ శ్రేణులు కొత్త ఉత్తేజంతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా చంద్రబాబు కూడా ఎక్కడ పొడగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకునే యత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది మొన్నటి వరకు సీన్.. తాజాగా పరిస్థితులు మారాయి. తెలంగాణలో కూడా పార్టీనీ నమ్ముకొని చాలా మంది నేతలు ఉన్నారు. వాళ్లు తిరిగి తెలంగాణలో రాజకీయంగా కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్ లో దిగిని చంద్రబాబుకు ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. చాలా రోజులు తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వచ్చినపుడు ప్రధాన కూడళ్లు పసుపుమయంగా మారడం సంచలనంగా మారింది. ఈ ర్యాలీ ఓ రకంగా టీడీపీ శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది.
ఇంత వరకూ బాగానే ఉన్నా...అసలు టీడీపీ అధినేత గ్రాండ్ ఎంట్రీ తెలంగాణ పాలిటిక్స్ లో ఏదైనా కీలక మార్పులకు నాంది కానుందా…? చంద్రబాబు ఎంట్రీతో తెలంగాణలో సరికొత్త రాజకీయాలకు తెరలేసే అవకాశాలు కనపడుతున్నాయి.అయితే చంద్రబాబు తిరిగి తెలంగాణ పాలిటిక్స్ లో దృష్టి పెడితే ఇప్పటి వరకు ఉన్నా రాష్ట్ర రాజకీయాల సమీకరణాలు మారే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే చంద్రబాబు రాజకీయాలు ఏ పార్టీకీ అనుకూలంగా మారనున్నాయి…? ఏ పార్టీకీ ప్రతికూలంగా మారనున్నాయో అనే చర్చ తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా చర్చ జరగుతుంది.
రాష్ట్ర విభజన నాటి నుంచి టీడీపీపై కానీ, చంద్రబాబు పై తెలంగాణ సమజానికి ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే తెలంగాణ పట్ల చంద్రబాబు కొంత వ్యతిరేక భావజాలంతో ఉన్నట్లు మెజార్టీ తెలంగాణ ప్రజల ఆలోచన.అలాంటి చంద్రబాబు ఏపీ సీఎం అవగానే మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుండడంతో ఇక్కడ ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో టీడీపీకీ కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. దీంతో అక్కడి జిల్లా ఇప్పటి వరకు పట్టు ఉన్న పార్టీల మెజార్టీ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయం. అయితే ఇది టీడీపీ గెలిచేంత పరిస్థితి ఉంటుందా అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేం కానీ అదే సమయంలో ఒక పార్టీ ఓటమికి మాత్రం ఖచ్చితంగా కారణమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టీడీపీ ఎవరి ఓటు బ్యాంకు చీల్చుతుందనేది మాత్రం మరింత లోతుగా చర్చ జరగాలి.తెలంగాణ ఏర్పాడ్డాక..బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని మెజార్టీ టీడీపీ నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్ారు. ఇప్పటికీ పార్టీలో ఉన్న సీనియర్లలో మెజార్టీ నేతలు టీడీపీకీ చెందిన వారే. అలాంటి టీడీపీ మళ్లీ తెలంగాణలో యాక్టివ్ అయితే బీఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు వ్యక్తిగతంగానే చాలా సన్నిహితులు. రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో రాజకీయంగా కూడా ఈ విషయంలో చాలా సార్లు ఇబ్బందులు కూడా పడ్డారు. రాజకీయంగా కూడా బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ ఉద్యమకారుల నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు మనిషి అనే ఒక ముద్ర ఉంది. ఇది రేవంత్ రెడ్డికి రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగించే అంశమే అని పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్నమాట. దానికి కారణం తెలంగాణపై చంద్రబాబు వైఖరి అని అంటున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి విభజన తర్వాత ఏపీకీ సీఎంగా అయిన తర్వాత చంద్రబాబు నిర్ణయాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయనేది మెజార్టీ తెలంగాణ ప్రజల అభిప్రాయం.అలాంటి చంద్రబాబుతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అతిగా రాసుకుపూసుకు తిరిగితే రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్ టాక్. అది ఒక రకంగా కాంగ్రెస్ కూడా రాజకీయంగా నష్టపరిచే అంశమే…రీసెంట్ గా ముఖ్యమంత్రుల హోదాలో రేవంత్, చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే కదా.
ఇక మరోవైపు ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్న బీజేపీకీ చంద్రబాబు ఎంట్రీ కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ గ్రామ స్థాయిలో బలం పెంచుకోవాలనకుంటున్న బీజేపీకీ టీడీపీ ఎంట్రీ కొంత డ్యామేజ్ చేసే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీకీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అందులో బీజేపీ బీసీ కార్డుతో ఇప్పటి వరకూ రాజకీయాలు చేసింది. ఇలాంటి తరుణంలో టీటీడీపీ ఎంట్రీ ఇస్తే బీజేపీపై కూడా ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
ఇక మరో ప్రధాన అంశం ఏంటంటే టీటీడీపీ రాజకీయ నిర్ణయాలు తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటే మాత్రం ఇబ్బంది లేదు. కానీ చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా అనిపిస్తే మాత్రం మరో ఉద్యమానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ కు చంద్రబాబు రూపంలో రాజకీయంగా పెద్ద అవకాశం దొరికినట్లే ..ఒక సారి కేసీఆర్ రంగంలోకి దిగాడో ఇక తెలంగాణ రాజకీయాలన్నీ ఊహించని స్థాయిలో మలుపులు తిరగడం ఖాయం. మళ్లీ తెలంగాణ ఉద్యమ నాటి పరిస్థితులు తలెత్తినా ఆశ్చ్యంపోవాల్సిన అవసరం లేదు.
ఇప్పుడున్న పరిస్థితులో చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తాడో మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో చంద్రబాబుకు పాలనా పరంగా చాలా సవాళ్లు ఉన్నాయి. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం త్వరగా పూర్తి చేయడం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం.ఇప్పటికే బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని భారీగా నిధులు రాబట్టడం వంటివి చంద్రబాబుకు అక్కడ కొంత సానుకూల అంశాలు అని చెప్పాలి. ఇంత పెద్ద టాస్క్ ఉన్న తరుణంలో చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో దృష్టిపెట్టే అవకాశం ఏ మేర ఉంటుందో కూడా చూడాలి. మొత్తంగా టీటీడీపీ పునర్నిర్మాణంపై చంద్రబాబు తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ప్రభావం చూపడం ఖాయమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter