TDP Leader Varupula Raja Passes Away: టీడీపీ సీనియర్ నేత వరుపుల రాజా (47) హఠాన్మరణం చెందారు. శనివారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. రాజా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడిగా వ్యవహారిస్తున్నారు. కొద్ది రోజులుగా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన నిన్న సాయంత్రం స్వగ్రామైన ప్రతిపాడుకు వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాత్రి 8.30 గంటల వరకు కుటుంబ సభ్యులు, పార్టీకార్యకర్తలతో ఆనందంగా గడపిన రాజా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావడంతో అతడిని హుటాహుటిన కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఎంత ప్రయత్నించినప్పుటికి ఆయనను వైద్యులు కాపాడలేకపోయారు. రాత్రి 11.20 గంటల సమయంలో రాజా మరణించినట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఈయనకు గతంలో రెండు సార్లు హార్ట్ ఎటాక్ రావడంతో స్టంట్లు కూడా వేశారు. 


రాజా సొంత ఊరు ప్రతిపాడు మండలంలోని పెదశంకర్లపూడి. ఈయన  తాత జోగిరాజు 1972లో ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజా  డీసీసీబీ ఛైర్మన్‌గా, ఆప్కాబ్‌ వైస్‌ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రాజా ఓటమిపాలయ్యారు. రాజాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Also Read: MLC Bachula Arjunudu: టీడీపీలో తీవ్ర విషాదం.. ఎమ్మెల్సీ బచ్చుల కన్నుమూత 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి