తెలంగాణ, ఏపీకి భారీ వర్ష సూచన
తెలంగాణ, ఏపీకి భారీ వర్ష సూచన
హైదరాబాద్: తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా కిలోమీటర్ ఎత్తులో ఆవరించి వున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు మంగళవారం, ఎల్లుండి బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది.