భారతీయ జనతా పార్టీపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీని తాము అసలు ఒక పార్టీగానే పరిగణనలోకి తీసుకోమని, ఆ పార్టీని ఒక జోక్‌గానే తీసుకుంటామని బీజేపీతోపాటు ఆ పార్టీకి చెందిన నేతలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు... వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కనీసం ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవాచేశారు. దేశంలో బీజేపీ రాకతో అంతకుముందున్న పథకాలకు పేరు మారింది కానీ ప్రజలకు మేలు చేసేవిధంగా పథకాల మార్పు జరగలేదని కేంద్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు కేసీఆర్. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉంది. దేశ రాజకీయాల్లో పెనుమార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా వుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.


ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారని, వాళ్లంతా తమకు వున్న అసహనాన్ని ప్రజల అసహనంగా భావిస్తున్నారని అన్నారన్న కేసీఆర్..  2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 10 సీట్లకు మించి రావు అని అభిప్రాయపడ్డారు.