ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు వైసిపి మద్దతు
ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు వైసిపి మద్దతు
హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి సైది రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డిని కలిశారు. శనివారం గట్టు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది. టీఆర్‌ఎస్ విజ్ఞప్తి మేరకు ఆ పార్టీకి మద్దతివ్వాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డికి తమ మద్దతు ఉంటుందని గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో హుజూర్ నగర్‌లో తమ బలం, విజయావకాశాలు ఇంకొంత పెరిగినట్టేనని టీఆర్ఎస్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.