Mla Vamsi on Sec Nimmagadda: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై విమర్శలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం నిమ్మగడ్డను టార్గెట్ చేసి..తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ( Sec Nimmagadda Ramesh Kumar ) పై నలువైపుల్నించీ విమర్శల ధాటి పెరుగుతోంది. పంచాయితీ ఎన్నికల ( Ap Panchayat elections ) ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ ప్రభుత్వంతో చీటికి మాటికి వివాదానికి దిగుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు, మంత్రులు మండిపడ్డారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra reddy )పై ఆంక్షలు విధించడంతో అధికార పార్టీ మరింత ఆగ్రహానికి గురైంది. ఇదే వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో..హైకోర్టు ( High Court ) నిమ్మగడ్డ ఇచ్చిన ఆంక్షల ఉత్తర్వుల్ని కొట్టివేసింది.


ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ( Telugu Desam ) కు చెందిన రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ( Tdp mla Vallabhaneni Vamsi ) ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డపై తీవ్ర విమర్శలు చేశారు. నిమ్మగడ్డకు పిచ్చి ముదిరిందని..నియంతృత్వ పోకడలకు పోతున్నారని మండిపడ్డారు. ఫిర్యాదులు వస్తే పరిశీలించాల్సింది పోయి..గృహ నిర్బంధం విధించడమేంటని ప్రశ్నించారు. విచారణే జరపకుండా అనామకుల ఫిర్యాదులపై ఎలా స్పందిస్తారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పగానే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్యలు తీసుకుంటారా అని నిలదీసారు. ఎస్ఈసీ చర్యలకు అన్నీ సరిపెడతామన్నారు. ఏకగ్రీవాలనేవి ( Unanimous ) కొత్త కాదని..ఏనాటి నుంచో ఉన్నాయన్నారు. ఇప్పుడు చంద్రబాబు ( Chandrababu ) ఏకగ్రీవాలు కొత్తగా ఇప్పుడే జరుగుతున్నట్టు మాట్లాడుతునన్నారని విమర్శించారు. గతంలో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాల జీవో ఇచ్చింది చంద్రబాబేనని గుర్తు చేశారు. 


Also read: High Court on Sec Orders: ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాల్ని కొట్టివేసిన హైకోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook