TDP Mahanadu: టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో మహానాడు ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షనిర్వహించారు. మహానాడు కమిటీలతో మంతనాలు జరిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒంగోలు సమీపంలోని మండవారి పాలెంలో టీడీపీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 27,28 తేదీల్లో రెండురోజులపాటు మహానాడు జరగనుంది. మహానాడుకు ఇంకా పదిరోజుల సమయం ఉండటంతో పనులను వేగవంతం చేయాలని నేతలను ఆదేశించారు. మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండోరోజు బహిరంగ సభ జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. ఒంగోలు మినీ స్టేడియంలో మహానాడు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు మొదట భావించారు. ఐతే ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో వేదికను మార్చారు.


ప్రభుత్వం తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ముందుగా సంప్రదించినా స్టేడియం ఇవ్వలేదన్నారు. కావాలనే టీడీపీ సభలను అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు. నూతనత్వం చాటేలా మహానాడు ఉండాలన్నారు చంద్రబాబు. మహానాడులో రాష్ట్ర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మహానాడు వేదికగా నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేసే అవకాశం ఉంది.


ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు(CHANRA BABU) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో యువతకే అధిక శాతం సీట్లు ఉంటాయని స్పష్టం చేశారు. సీనియర్ నేతలకు నామినెటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే ఉందని..ప్రజల్లో నిత్యం ఉండాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు.


Also read: North Korea Corona: ఉత్తర కొరియాలో కరోనా టెర్రర్..హెల్త్ ఎమర్జెన్సీ విధింపు..!


Also read: India-China Border: దేనికైనా రెడీ..చైనాకు ధీటుగా భారత్ సమాధానం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.