Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికొస్తారని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు. కేవలం కక్ష సాధింపుతోనే అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. సంక్షేమాన్ని గాలికొదిలి..కేవలం ప్రతిపక్షాల్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విరుచుకుపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 16 నెలలు జైలులో ఉన్న వైఎస్ జగన్..చంద్రబాబును 16 రోజలైనా జైలులో ఉంచాలనే కుట్రతో ఇలా చేశారని బాలకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు వార్త విని చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని, కొందరికి గుండెపోటు వచ్చిందని త్వరలో వారిని పరామర్శిస్తానని చెప్పారు.


ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలు కేసులు పెట్టారని త్వరలో మరిన్ని కేసులు పెట్టేందుకు సిద్ధమౌతున్నారని బాలకృష్ణ విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ఓ పాలసీ అని..గుజరాత్‌లో అమలైన ఈ పథకాన్ని ఏపీలో ప్రవేశపెట్టామన్నారు. తద్వారా హిందూపురంలో వందలాదిమంది ఉపాధి కలిగిందని చెప్పారు. పాలన చేతకాక రాష్ట్రాన్ని అప్పుులపాలు చేశారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే  చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించినట్టు చెప్పారు. 


నిజంగా అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా అని ప్రశ్నించారు. అవినీతి జరిగితే ఛార్జిషీటు ఎందుకు దాఖలు చేయలేదని , కేవలం కక్ష సాధింపే జగన్ లక్ష్యమని చెప్పారు బాలకృష్ణ. ముఖ్యమంత్రి అనే వ్యక్తి కేవలం  పాలసీ మేకర్ అని పథకాన్ని అమలు చేసేది అధికారని చెప్పారు. ప్రభుత్వం నాడు 370 కోట్టు ఖర్చుచేసిందని.. 2.13 లక్షలమందికి శిక్షణ ఇచ్చిందన్నారు. జగన్ చేసే కుట్రల్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, పదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తి ఓ దార్శనికుడిపై కేసులు వేయడం అన్యాయమన్నారు. రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరమొచ్చిందని బాలకృష్ణ పిలుపునిచ్చారు. తాను ముందుంటానని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 


Also read: Chandrababu: చంద్రబాబు అరెస్టును సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook