Tension created at Chandrababus residence : ఏపీలోని ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu) నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై (YS Jagan Mohan Reddy) టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ సంస్మరణ సభలో టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ సహా పలువురు నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసం సమీపంలో నిరసన చేపట్టారు. కొందరు టీడీపీ నేతలు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తోపాటు బుద్దా వెంకన్న, పట్టాభి తదితరులు అక్కడికి వచ్చి వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Nitin Gadkari youtube income: యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్‌ చేస్తూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నెలకు సంపాదించే డబ్బు ఎంతో తెలుసా?


చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ జోగి రమేశ్‌ (Jogi Ramesh) నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనలో ఎమ్మెల్యే జోగి రమేశ్‌ కారుపై కొందరు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రమైంది.


ఈ ఘటనపై జోగి రమేష్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తన కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. చంద్రబాబు (Chandrababu)వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయన్ని ఏపీలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు యత్నించే క్రమంలో లాఠీఛార్జ్‌ చేశారు.


Also Read : Priyanka Chopra: అమెరికా రియాల్టీ షో వివాదం: సారీ చెప్పిన ప్రియాంక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook