జనసేన ఆధ్వర్యంలో నియమించిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (నిజనిర్థారణ కమిటీ) సమావేశాలకు వచ్చిన కార్యకర్తలు, మిగతా పార్టీల ప్రతినిధులు, మీడియా సంస్థల ప్రతినిధులు అందరికీ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజు పాటు జరిగిన ఈ సమావేశాల్లో చాలా విషయాలను లోతుగా, విశ్లేషణాత్మకంగా, విస్తృతంగా  చర్చించామని ఆయన తెలిపారు.


ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ప్రభుత్వం తరపున వివరాలు ఇచ్చినందుకు ఆయన ఆ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తమ కమిటీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు, అలాగే ప్రభుత్వం ఇచ్చిన నిధుల గురించి లోతైన పరిశీలన చేస్తుందని.. అందుకే తమ నిజనిర్థారణ కమిటీ సబ్ కమిటీలు కూడా వేసి.. ఆ దిశగా కార్యాచరణ చేపట్టిందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే అందిస్తామని ఆయన తెలియజేశారు.