చంద్రయాన్-2తో మానవాళికి బోలెడు ప్రయోజనాలు !!
చందమామా రావే జబిల్లి రావే అనే రోజులు పోయాయి.. చంద్రబాబు దగ్గరకు వెళ్లాలంటే ఇప్పుడు డైరెక్ట్ గా రాకెట్ వేసుకొని వెళ్లే పరిస్థితులు వచ్చేశాయ్..
జాబిల్లిపై భారతకు చెందిన మరో రాకెట్ పయనమయ్యేందుకు సిద్ధమౌతోంది. అత్యంత సవాల్ తో కూడిన చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఇస్త్రో శాస్త్రవేత్తలు .. ఈ రోజు మధ్యాహ్నం 2.43 గంటలకు దీన్ని ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను తీసుకుని జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ నింగికి ఎగరనుంది. భారీ అంచనాలతో నింగిలోకి వెళ్తున్న ఈ వాహకనౌక మొత్తం 3.8 టన్నుల బరువుగల ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.
చంద్రయాన్ -2 ప్రయోజనాలివే...
చంద్రయన్ -2 ప్రయోగంతో ఒనగూరే ప్రయోజనాల విషయానికి వస్తే...తాజాగా పంపే ఉపగ్రహాల ద్వారా చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి.. ఆ సమాచారాన్ని, చిత్రాలను పంపించనుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి పరిశోధనలు చేస్తుంది. రోజు రోజుకు భూ మండలంపై ఖనిజాలు అంతరించి పోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ప్రపంచ అవసరాల కోసం చంద్రుడికిపై ఉన్న ఖనిజాలు ఉపయోగించే వీలు కల్గుతుంది. అందుకు చంద్రయాన్ ప్రయోగం నాంది పలకనుంది.
చంద్రుడిపై హ్యూమన్ కాలనీ !!
భూమికి అది దగ్గరగా ఉన్న గ్రహాల్లో చంద్రడు ఒకటి. భూ వాతావరణానికి అతి దగ్గరగా ఉన్న గ్రహంగా ఇది తేలింది. భూమండం తప్పితే భవిష్యత్తులో హ్యూమన్ కాలనీలో ఏర్పడటానికి అవకాశమున్న గ్రహం ఏదైన ఉంటే చంద్రడు మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యానికి గురౌవుతున్నప్పటికి భవిష్యత్తులో ఇది సాధ్యమవ్వచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.చంద్రయాన్ ప్రయోగాలు భవిష్యత్తు మరిన్ని అంతరిక్ష పరిశోధనలు చేయడానికి ...తద్వారా అక్కడ మానవ కాలనీలు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు .
తొలి సక్సెస్ స్పూర్తితో..
చంద్రయాన్ -1 ప్రయోగంతో అమెరికా రష్యా చైనా తర్వాత చంద్రుడిని ఉపగ్రహాలు పంపిన నాల్గో దేశంగా భాతరదేశం గుర్తింపు సాధించింది. మొదటి ప్రయత్నంలోనే అతి తక్కువ ఖర్చుతో భారత ప్రయోగం విజయవంతమవడం గమనార్హం. చంద్రుడిపై నీరు ఉందని గత ప్రయోజగాలతో తేలింది. అయితే ఎవరూ దీన్ని కచ్చితంగా చెప్పలేకపోయారు. కాగా చంద్రయన్ 1 ద్వారా చంద్రుడినిపై నీరు ఉందని కచ్చితంగా తేల్చారు. ఇప్పుడు ఇదే స్పూర్తితో మరిన్ని ప్రయోజనాలు ఆశిస్తూ చంద్రయాన్ -2 ప్రయోగం చేస్తున్నారు భారత శాస్త్ర వేత్తలు.మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఈ అద్భుత ప్రయోగం సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం..