తెలుగు రాష్ట్రాలపై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భగ భగ మండే ఎండల కారణంగా ఉదయ 10 గంటలు దాటాక బయటికి రావాలంటేనే  జనాలు హడలెత్తిపోతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో మంగళ వారం ఒక్క రోజే ఎండ తీవ్రతకు ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణాలు కోల్పోయారు. వడదెబ్బ కారణంగా గుంటూరు జిల్లాలో ఓ చిన్నారి మృతి చెందగా.. భద్రాద్రి కొత్తగూడెంలో ఒకరు ..మహబూబ్ నగర్ లో ఒకరు ప్రాణాలు విడిచారు. 


వైద్యుల సూచనలు...
తాజా పరిస్థితుల నేపథ్యంలో జనాలు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు సూచిస్తున్నారు. బయటికి వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు నీడ పట్టునే ఉండాలనీ... ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తెలుపు రంగు లేదా తేలికపాటి రంగులున్న దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసేవారు తరచూ కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు వంటి పానియాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు