Times Now-ETG Survey: దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 19 నుంచి తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈలోగా వివిద జాతీయ మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. ఏ పార్టీకు ఎక్కడ ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ- ఈటీజీ చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు నెలరోజుల వ్యవధిలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఫోకస్ చేసి సర్వే నిర్వహించింది టైమ్స్ నౌ జాతీయ సంస్థ. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో అధికార పార్టీని కాదని బీజేపీ 21-23 సీట్లు గెల్చుకోవచ్చని, కాంగ్రెస్ పార్టీ కేవలం 4-6 స్థానాలకు పరిమితం కావచ్చని తెలుస్తోంది. ఇక జేడీఎస్ 1-2 లోక్‌సభ స్థానాలు గెల్చుకోవచ్చని టైమ్స్ నౌ ఈటీజీ అభిప్రాయపడింది. 


ఇక 39 లోక్‌సభ స్థానాలున్న తమిళనాడులో అధికార డీఎంకే 21-22 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 5-7 సీట్లు గెల్చుకోవచ్చని టౌమ్స్ నౌ-ఈటీజీ సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ ఈసారి 2-6 స్థానాలు సాధించవచ్చు. ఏఐఏడీఎంకేకు 1-3 స్థానాలు లభించనున్నాయి. ఇతరులు మరో 4-5 స్థానాలు గెలవవచ్చు. ఇక కేరళలో కాంగ్రెస్ పార్టీ 8-10 స్థానాలు, సీపీఎం 6-8 సీట్లు, ఐయూఎంఎల్ 1-2 స్థానాలు గెలిచే పరిస్థితులున్నాయని అంచనా వేసింది. ఇతరులు మరో 1-2 స్థానాలు సాధించవచ్చు. 


ఇక తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 8-10 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీ 4-6 లోక్‌సభ స్థానాల్లోనూ, బీఆర్ఎస్ పార్టీ 1-3 స్థానాల్లోనూ విజయం సాధించవచ్చు. ఇక ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 21-22 లోక్‌సభ సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. తెలుగుదేశం-బీజేపీ-జనసేన కూటమికి 3-4 స్థానాలు దక్కవచ్చు. అంటే ఏపీలో మరోసారి అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే తెల్చిచెప్పింది. 


Also read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook