Tirumala Traffic Jam: తిరుమలలో భారీగా ట్రాఫిక్ జామ్.. ధనుష్, నాగ్ సినిమాతో భక్తులకు ఇబ్బందులు
Alipiri Traffice Jam: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు కొత్త కష్టాలు వచ్చాయి. సినిమా చిత్రీకరణ జరుగుతుండడంతో వాహనాలను దారి మళ్లించారు. దీనివలన పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తిరుమల మార్గంలో గందరగోళం ఏర్పడింది.
Dhanush, Nagarjuna Movie Shooting: దైవ దర్శనానికి వెళ్లిన భక్తులు తీరని కష్టాలు ఎదుర్కొన్నారు. తిరుమలలోని అలిపిరి వద్ద సినిమా షూటింగ్‌కు అనుమతినివ్వడంతో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. షూటింగ్ వలన దారి మళ్లింపుతో తీవ్ర ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. కొండపైకి వెళ్లే వాహనాలను దారి మళ్లించడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. బౌన్సర్లు, పోలీసులు మొహరించడంతో అందరూ ఆందోళన చెందారు. కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అలిపిరి మార్గంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో ధనుష్, అక్కినేని నాగార్జున నటిస్తున్నారు. మంగళవారం నుంచి షూటింగ్ మొదలైంది. అలిపిరి వద్ద షూటింగ్ వలన వాహనాలను దారి మళ్లించారు. హరేరామ హరేకృష్ణ రోడ్డులోకి వాహనాలను దారి మళ్లించారు. ఇరుకైన మార్గంలో కావడంతో ఆ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో షూటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. షూటింగ్‌కు ఇక్కడ ఎలా అనుమతి ఇచ్చారని భక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు
Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి