Pawan Kalyan Reacts On TTD Laddu Controversy: కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్రవివాదం నెలకొంది. గత ప్రభుత్వం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగించిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. స్వామి వారి లడ్డూల తయారీ కోసం వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిశాయని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. గుజరాత్‌కు చెందిన ఎన్‌డీడీబీ కాఫ్‌ లిమిటెడ్‌ ఈ విషయాన్ని వెల్లడించినట్లు చెబుతోంది. నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Devara: దేవర టైటిల్ పెట్టడానికి అసలు కారణం అదే.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..


తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ రియాక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేారు. ట్విట్టర్‌లో ఓ సంస్థ కంప్లైంట్‌కు రిప్లై ఇచ్చిన ఆయన.. లడ్డూ వివాదంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు ఇందుకు సమాధానం చెప్పాలని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వినిగించడం అందరి మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని కోరారు. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసిరావాలన్నారు. బోర్డు ఏర్పాటుపై చర్చ జరగాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.


లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. శ్రీవారి చెంత ప్రమాణానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. లడ్డూ వివాదంపై ఇంతవరకు టీటీడీ ఉన్నతాధికారులు మాత్రం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. స్వామి వారికి సమర్పించే నైవేద్యంలో ఆర్గానిక్ సామాగ్రి వాడామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ విషయంపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డు ప్రసాదం వివాదంపై హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో గాని లేక హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని కోరింది. బుధవారం వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.


Also Read: Gurugram Bike Accident: ఎస్‌యూవీ-బైక్‌ యాక్సిడెంట్‌ వీడియో వైరల్‌.. బైకర్‌ ప్రాణాలు తీసిన భయానక విజువల్స్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.