Tirumala Laddu Row: పవన్ అసలైన సెక్యులర్.. లడ్డు వివాదం వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు..

Nagababu on Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదంపై నాగబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా పవన్ నిజమైన సెక్యులర్ అంటూ నాగబాబు కొనియాడారు.
Tirumala laddu controversy: ఆంధ్ర ప్రదేశ్ లో తిరుమల లడ్డు వివాదం పీక్స్ కు చేరింది. ముఖ్యంగా.. తిరుమల లడ్డు వివాదం దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు దీనిపై దేశంలో పెను దుమారం కొనసాగుతుంది. లడ్డు వివాదంపై చంద్రబాబు ప్రభుత్వం సిట్ ను సైతం ఏర్పాటు చేసింది.
మరోవైపు సుప్రీంకోర్టులో కూడా లడ్డు వివాదంపై పలు పిటిషన్ లు సైతం దాఖలయ్యాయి. ఈ క్రమంలో తాజాగా, లడ్డువివాదంపై నాగబాబు మరోసారి స్పందించారు. ఇటీవల లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
హిందువుల అస్తిత్వానికి, దేవాలయాలకు, హిందు ధర్మానికి హానీ కల్గుతుంటే స్పందించకూడదా.. అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కొంత మంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సపోర్ట్ గా నిలుస్తుండగా.. వైసీపీతో పాటు, ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా కౌంటర్ లు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. తిరుమల లడ్డు వివాదంపై తాజాగా, జనసేన నాగబాబు స్పందించారు.
పూర్తి వివరాలు..
తిరుమల లడ్డు వివాదంపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో..నాగబాబు మాట్లాడుతూ.. హిందువులే హిందువులను అవమానించడం సబబుకాదని ఆయన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారన్నారు. పవన్ కల్యాణ్ అసలైన సెక్యులర్ అని సమర్థించారు. పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్ అంటూ ఫైర్ అయ్యారు.
అదే విధంగా.. డిక్లరేషన్ పై వైసీపీ అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని.. కేవలం ఒక సంతం పెడితే వచ్చేనష్టమేముందని అన్నారు. అందరు అన్ని మతాల వారి పద్ధతులు, ఆచారాలను గౌరవించుకొవాలని కూడా నాగబాబు అన్నారు. అదే విధంగా.. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా హిందూధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని నాగాబాబు డిమాండ్ చేశారు. లడ్డు వివాదం వెనుక ఎంతటి వారున్న కూడా సిట్ దర్యాప్తులో బైటపడతారని అన్నారు. వైసీపీ వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలను నాగబాబు ఖండించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.