Pawan Kalyan Sanathanam: తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు..దేశమంతా కలకలం రేపాయి. హిందూవుల మనోభావాలకు సంబంధించింది అయినందున ఆందోళన నెలకొంది. ఇదే అదనుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో సనాతన అవతారం ఎత్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల లడ్డూ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకు రాజకీయంగా మైలేజ్ వచ్చిందో లేదో గానీ సుప్రీంకోర్టు తీర్పుతో ఆ పార్టీ ఇరుకున పడింది. అయితే అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో సనాతన డిక్లరేషన్ చేయడం ఆ పార్టీకు మైలేజ్ తెచ్చిపెట్టిందని కొందరి వాదన. పవన్ కళ్యాణ్ సనాతన అవతారం అలవోకగా చేపట్టింది కాదని..దీని వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. అందుకే తిరుమల లడ్డూ కల్తీపై ఆధారాల్లేవని సుప్రీంకోర్టు చెప్పినా పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి సభలో సనాతన వ్యాఖ్యలు తీవ్రం చేశారు. సనాతనం పాటించేవారి పట్ల చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని, ధర్మాన్ని వ్యతిరేకించేవారికి న్యాయస్థానాలు సైతం రక్షణ కల్పిస్తున్నాయని చెప్పడం ఇందుకు ఉదాహరణ. అంతేకాకుండా దేశంలో సనాతనం పరిరక్షణకు ఓ వ్యవస్థ ఉండాలని ప్రకటించారు. 


ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలోని హిందూ ఓట్ల సమీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తారాదిన బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ విధానాన్ని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడని సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలో నిలదొక్కుకోవాలని ఎప్పట్నించో భావిస్తున్న బీజేపీకు పవన్ కళ్యాణ్ ఓ ఆయుధం కావచ్చని తెలుస్తోంది. అందుకే చాలాకాలంగా జనసేన-బీజేపీ విలీన ప్రతిపాదన నడుస్తోంది. ఒకవేళ జమిలి ఎన్నికలు సంభవిస్తే..అప్పటిలోగా విలీనం పూర్తి చేయాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖచిత్రం కానున్నారు. 


ఎందుకంటే బీజేపీకు సొంతంగా పోటీ చేసినప్పుడు రాష్ట్రంలో ఎప్పుడూ డిపాజిట్లు కూడా దక్కలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ కొన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెల్చుకుంటోంది. ఇప్పటి వరకూ ఆ పార్టీకు రాష్ట్ర నేతలుగా వ్యవహరించిన వ్యక్తులు కూడా ఆ పార్టీ బలోపేతం కాకపోవడానికి కారణం కావచ్చు. అందుకే బీజేపీ జనసేనాని పవన్ కళ్యాణ్ వైపు చూస్తోంది. సినిమాభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం అండ ఉండటంతో  జనసేనను విలీనం చేసుకుని హిందూత్వను పైకి తీసుకొస్తే ఏపీలో ఓటు బ్యాంకు పెంచుకోవడమే కాదు..బలోపేతం కావచ్చనేది బీజేపీ ఆలోచన. 


Also read: AP DSC 2024 Notification: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తేదీ ఖరారు, ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.