TTD New Website ttdevasthanams.ap.gov.in: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్‌సైట్ పేరును మరోసారి మారినట్లు టీటీడీ వెల్లడించింది. గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉండగా.. ప్రస్తుతం ttdevasthanams.ap.gov.in గా మార్పు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాల్సిందిగా కోరారు. తిరుపతి, ఇతర ప్రాంతాలలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో కొత్త వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.in ను TTD ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ పేరు మార్పుని వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌ సైట్, వన్ మొబైల్ యాప్‌లో భాగంగా మార్చినట్లు అధికారులు తెలిపారు. ఇక నుంచి శ్రీవారి భక్తులు ఆన్‌లైన్ బుకింగ్‌ను ttdevasthanams.ap.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేసుకోవాలని సూచించారు. శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా వెబ్‌సైట్ పేరుని మారుస్తూ TTD బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని.. ఒకే సంస్థ, ఒకే వెబ్‌సైట్, ఒకే మొబైల్ యాప్ ఉండాలనే నిర్ణయంతో పేరుని మార్చినట్లు వెల్లడించారు. ఇక నుంచి భక్తులు స్వామి వారి దర్శనం లేదా ఆలయ వివరాల కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకుంటే.. కొత్త వెబ్‌సైట్‌ను ఉని ఉపయోగించాలని కోరారు.


గతంలో TTD వెబ్‌సైట్ పేరు టీటీడీ సేవా ఆన్‌లైన్ అనే పేరుతో ఉండగా.. అనంతరం టీటీడీ వెబ్‌సైట్‌ను ప్రభుత్వానికి అనుబంధం చేస్తూ tirupatibalaji.ap.gov.in గా ఛేంజ్ చేశారు. ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చి.. ttdevasthanams.ap.gov.in గా మార్చారు. తాజాగా ప్రారంభించిన కొత్త వెబ్‌సైట్‌లో తిరుపతిలో టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, చరిత్రతో సహా శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణ వివరాలు, బస సహా ఇతర వివరాలు ఉంటాయి. భక్తులు ఒక్క క్లిక్‌తో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం కొత్త వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది. 


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook