Tirumala Darshan Tokens: ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరగనుంది. తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. దర్శన టోకెన్ల విషయంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. అలిపిరి నుంచి కాలినడకన స్వామి దర్శనానికి భక్తులకు గతంలో గాలి గోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసేవారు. శుక్రవారం నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని మార్చారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టోకెన్లు పొందిన భక్తులు గాలి గోపురం దగ్గర కచ్చితంగా స్కాన్‌ చేయించుకుని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. స్కాన్ చేయించుకోకుండా వెళ్లినా.. ఇతర మార్గాల్లో తిరుమలకు వెళ్లినా స్వామి వారిని దర్శనానికి అనుమతించరు. దర్శనం టికెట్లు ఉన్నాయి కాదా..? అని మీరు అడిగినా పర్మిషన్ ఇవ్వరు. కాలినడక మార్గంలో గాలి గోపురం వద్ద కచ్చితంగా స్కాన్ చేయించుకోండి.  


శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద జారీ చేస్తారు. ఈ కేంద్రాన్ని మార్చలేదు. టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల కేంద్రాన్ని మాత్రం మార్చారు టీటీడీ అధికారులు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ నుంచి విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయానికి మార్చారు. వాహనాల్లో తిరుమలకు వెళ్లే భక్తులకు సర్వదర్శనం టోకెన్లు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం, రైల్వేస్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, తిరుపతి రైల్వేస్టేషన్ వెనుకాల గోవింద రాజసత్రాలు జారీ చేస్తున్నారు. భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు.


Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం బంపర్ గిఫ్ట్.. 8వ వేతన సంఘంపై కీలక నిర్ణయం..?


గురువారం 67,687 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చింది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.


Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.