Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి గుండెపోటులో మృతి చెందిన ఘటన విషాదం నింపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో తిరుపతి లోక్‌సభ స్థానానికి(Tirupati Loksabha Bypoll) జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ ప్రశాతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల్నించి ప్రారంభమైన పోలింగ్ ( Tirupati Polling) సాయంత్రం 7 గంటల వరకూ జరగనుంది. కోవిడ్ పాజిటివ్ లక్షణాలున్న ఓటర్లు ఓటేయడానికి సాయంత్రం 6 గంటల్నించి 7 గంటల వరకూ అనుమతిస్తారు. గతంలో ప్రతి 15 వందల మందికి ఒక పోలింగ్ బూత్ ఉండగా..ఇప్పుడు ప్రతి వేయి మందికి ఓ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. తిరుపతి ఎన్నికల బరిలో 28 మంది పోటీలో ఉండగా..17 లక్షల 11  వేల 19 మంది ఓటర్లు విజేతను తేల్చనున్నారు.


ఇక శ్రీకాళహస్తిలోని పోలింగ్ కేంద్రాల(Polling Stations)వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి కన్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party) అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి మన్న సముద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. సత్యవేడులో రెండు ఈవీఎంలలో సాంకేతికలోపాలు తలెత్తాయి. నెల్లూరులో ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దొంగఓటర్లు వచ్చారంటూ హల్‌చల్ చేశారు. అనుకూల మీడియాను తీసుకుని పీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద హడావిడి చేశారు. ఫంక్షన్ హాల్ సిబ్బంది ఎందుకున్నారని ప్రశ్నించారు. ఆఖరికి తిరుమలకు వెళ్లే భక్తుల్ని కూడా అడ్డుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 23 కంపెనీలు కేంద్ర బలగాలు, 37 ఫ్లయింగ్ స్క్వాడ్ బందాల్ని నియమించారు. కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission) ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. మరోవైపు 816 మంది మైక్రో అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంటారు. 


Also read: TDP MP కేశినేని నానికి కరోనా పాజిటివ్, వ్యాక్సిన్ తీసుకున్న వారంలోపే COVID-19


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboon