Owaisi Sensational comments on Tirumala Laddu: తిరుమల తిరుపతి  లడ్డూ వివాదంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు.  వక్ఫ్‌బోర్డును రద్దు చేసే కుట్ర జరుగుతోందన్న ఆయన తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దేశవ్యాప్తంగా రాద్దాంతం జరుగుతోందన్నారు. హిందువుల నమ్మకాన్ని తాము గౌరవిస్తామని... లడ్డూలో అలా జంతువుల కొవ్వు కలవడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సందర్భంగా తమ వక్ఫ్‌ బోర్డు ఆస్తులను లాక్కునేందుకే  కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  మండిపడ్డారు. అయితే.. హిందువుల నమ్మకాలకు వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు సంబంధం ఏమిటనేది కొంత మంది నెటిజన్స్ అసదుద్దీన్ ఒవైసీని ప్రశ్నిస్తున్నారు.  ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ ఇప్పటికే తాజ్ మహల్, బెట్ ద్వారక, తమిళనాడులోని ఓ గ్రామం వక్ఫ్ బోర్డ్ కు సంబంధించినదని క్లెయిమ్ చేయడం వివాదాస్పదమైంది.


అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ కు లేనీ పోని అధికారులు ఇచ్చింది. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డ్ తమదని ప్రకటిస్తే.. అది  తమ ఆస్తి అని నిరూపించుకోవడానికి సదురు వ్యక్తి వక్ఫ్ బోర్డ్ కు చెందిన న్యాయస్థానంలోనే అప్పీల్ చేయాలి. ఇక ఈ ఆస్తి ఎవరనేది  నిర్ణయించేది అందులోని సభ్యులే. ఇలా చట్ట విరుద్ధంగా వక్ఫ్ బోర్డ్ మన దేశంలో మిలటరీ, రైల్వే తర్వాత అత్యధిక భూములున్న మూడో సంస్థగా నిలిచింది. ముస్లిమ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పడ్డ ఈ బోర్డ్ అందులో ఉన్న కొంత మంది స్వార్ధ పరుల  తప్పుడు విధానాల వల్ల అమాకుయకులు బలవుతున్నారు. వక్ఫ్ బోర్డ్ వల్ల ఎక్కువ నష్టపోయింది ముస్లిమ్ సోదరులే ఎక్కువగా ఉన్నారు. దుర్మార్గమైన ఈ చట్టం రద్దు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా సంకల్పించడం మంచి పరిణామామని చాలా మంది ముస్లిమ్ సోదరులే చెబుతున్నారు.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.