చంద్రబాబు Vs మోడీ : విశాఖలో ఎవరిది పైచేయి ?
ప్రధాని మోడీకి ఈ రోజు విశాఖ పర్యటనలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నగరంలోని ఏర్పాటు చేసిన ప్రజాచైతన్య సభలో పాల్గొండటారు. ఏపీకి గత నాలుగరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఈ సభ ద్వారా జనాలకు ప్రధాని మోడీ వివరించనున్నారు. ప్రధానంగా రైల్వే జోన్ ప్రకటన అంశాన్ని ప్రస్తావించి ఉత్తరాంధ్ర జిల్లాలో బీజేపీకి అనుకూల వాతావరణం సష్టించుకోవాలనే వ్యూహంతో ఉన్నారు. ఇప్పటికే ఓ సారి గుంటూరులో పర్యటించిన ప్రధాని మోడీ విభజన హామీల విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. విశాఖ పర్యటనలోను ఇదే తరహాలో టీడీపీపై ఎదురుదాడి చేస్తారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రైల్వే జోన్ పై అభ్యంతరాలు
రైల్వే జోన్ ప్రకటించిన నేపథ్యంలో విశాఖలో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి నిరసన సెగలు తప్పేలా లేవు. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. జనాలు నల్లజెండాలు నల్ల బెలూన్లు, నల్లచొక్కాలతో ప్రదర్శలు జరపాలని కోరారు. ఏమాత్రం ప్రయోజనం లేని విధంగా రైల్వేజోన్ ప్రకటించిన కేంద్రాన్ని నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖ జోన్ లో కలపాల్సిన వాల్తేరు డివిజన్ ను ఎందుకు విభజించారని ఈ సందర్భంగా చందబాబు ప్రశ్నించారు. వాల్తేరు డివిజన్ ను విభజించి ఆదాయం లేని విశాఖ జోన్ ఆధాయం లేకుండా చేశారని విమర్శలు సంధించారు. వాల్తేరు డివిజన్ అని.. దీన్ని ఎక్కువశాతం ఒడిశాకు తరలించాలరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటనపై ఉత్కంఠత నెలకొంది. ప్రధాని మోడీకి టీడీపీ నిరసన సెగలు ఏ స్థాయిలో తాకుతాయి.. టీడీపీపై ఆయన ఈ విధంగా ఎదురుదాడి చేస్తారనే దాని అంశంపై చర్చనీయంశం మారింది.