టాలీవుడ్ నటులు ఏపీకి హోదా గురించి పోరాడరా? అన్న టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై టాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తామేమీ ఏసీ గదుల్లో కూర్చొని విలాసం గడపడం లేదని.. రాజకీయ ప్రయోజనాల కోసం అవిశ్వాసం పెట్టారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అటు మాటమార్చే చంద్రబాబు ను నమ్మి ఎలా ముందుకు రావాలని పోసాని కృష్ణమురళి అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యభిచారులను నమ్మి  మీతో రావాలా? అని ఘాటుగా ప్రశ్నించారు. హోదా కోసం పోరాడే పద్ధతి, సమయం ఇది కాదని ఇతర ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు.  పరిశ్రమను అగౌరవ పరిచే మాట తీరు మార్చుకోవాలని సూచించారు. రాజేంద్ర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పలని డిమాండ్ చేశారు. విపత్కర సమయాల్లో ఆదుకొనేందుకు ఇండస్ట్రీ ముందుంది. రాజకీయ నాయకులు ఇండస్ట్రీని టార్గెట్ చేయడం మంచింది కాదన్నారు.  


మంగళవారం తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, ఏపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై స్పందించకుండా తెలుగు సినీ పరిశ్రమ మౌనం వహిస్తోంది అంట అసహనం వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకమై గళమెత్తుతోంటే,  టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ దూరంగా ఉందన్నారు. తమిళనాడు ఇండస్ట్రీని చూసి నేర్చుకోవాలని.. జల్లికట్టు, కావేరీ అంశాలపై వారు స్పందించే తీరెలా ఉంది?మీ తీరెలా ఉంది? అని ప్రశ్నించారు.