Tomato, Mirchi Price Hike: కూరగాయల ధరలు ఆకాశాన్నింటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వారం రోజుల కిందట రూ.30-40లే పలికిన టమాటా ధరలు.. ఇవాళ ఏకంగా సెంచరీ కొట్టేశాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడం, ఉత్తరాదిలో వరదలు, పలు రాష్ట్రాల్లో టమాటా పంట దెబ్బతినడం,  సరఫరాలో అంతరాయమే ధరల పెరుగుదలకు కారణాలుగా వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ధరలు పెరగడంతో కొనుగోళ్లు కాస్త తగ్గాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు కిలో టమాటాను బహిరంగ మార్కెట్లో రూ.100 నుంచి రూ. 120 మధ్య అమ్ముతున్నారు. టమాటాతోపాటు పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాప్సికం, బీర, భీన్స్ తదితర కూరగాయల ధరలు కూడా పెరిగాయి. పచ్చిమిర్చి కూడా వందకపైనే అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రూ. 200 కూడా విక్రయిస్తున్నారు. భీన్స్ కూడా రూ.120కు చేరింది. బీర, బజ్జీమిర్చి, చిక్కుడు, క్యాప్సికం ధర రూ.80; గోకర, క్యారెట్‌, వంకాయ, బెండ, కాకర రూ.60గా ఉన్నాయి. డజను నిమ్మకాయలు రూ. 60 పలుకుతున్నాయి. కరోనా తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఆకుకూరల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 




పెరుగుదల తాత్కాలికమే
వర్షాలు టమాటాల రవాణాపై ప్రభావం చూపాయని.. దాని కారణంగానే ధరలు పెరిగాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ అన్నారు. ధరల పెరుగుదల తాత్కాలికమేనని... త్వరలోనే తగ్గుతాయని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ తప్పుడు విధానాల వల్లే టమాటా ధరలు పెరిగాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. 


Also Read: Ammavodi Scheme: తల్లులకు గుడ్‌న్యూస్ రేపే ఖాతాల్లోకి అమ్మ ఒడి డబ్బులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook