ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల ముందున్న ప్రస్తుత సమస్య కరోనా వైరస్. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. ప్రతి రంగానికి కరోనా కొన్ని నెలలపాటు చెక్ పెట్టింది. పలు దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. అయితే కరోనా గాలి ద్వారా, వస్తువుల ద్వారా, కరోనా బాధితులను తాకడం ద్వారా ఇలా పలు మార్గాలలో ఇతరులకు వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్నాం. షాకింగ్: అక్కడ 3000కు చేరిన కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రస్తుతం చాలామందిని కలవరపెడుతున్న విషయం కరెన్సీ నోట్లు. వీటి ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే నిజమేనని సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనలు వీటికి ఊతమిస్తున్నాయి. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి జరిగిందని ఏపీలో మొదటిసారిగా గుర్తించారు. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు


విదేశీ ప్రయాణాలు చేయకున్నా, కరోనా బాధితులను కలవకున్నా గుంటూరు జిల్లాలో ఓ ఆర్ఎంపీ డాక్టర్‌కు, తూర్పు గోదావరి జిల్లాల్లో టీచర్‌కు కరోనా సోకింది. అయితే వీరికి కరోనా సోకడానికి కరెన్సీ మాత్రమే మాధ్యమమని అధికారులు చెబుతున్నారు. కేబుల్, టీవీ, పాలు ఇతర బిల్లులు, కిరాణా స్టోర్లలో కరెన్సీ నోట్లు వాడకం ఉందని, డిజిటల్ పేమెంట్ల ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చునని అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్ మార్గదర్శకాల పూర్తి జాబితా.. మందుబాబులకు మళ్లీ నిరాశే


సాధ్యమైనంత వరకు కరెన్సీ వాడకుండా, డిజిటల్ చెల్లింపులు చేసి కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల అధికారులకు దీనిపై పోలీసులు సమాచారం అందించినట్లుగా ప్రకటన సైతం హాట్ టాపిక్‌గా మారింది. వీలైనంత వరకు కాయిన్లు, నోట్లు వాడకాన్ని కొంతకాలం ఆపివేసి.. సాధ్యమైనంతగా డిజిటల్ చెల్లింపులు (పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే) ఇతరత్రా యాప్స్ ద్వారా చెల్లించడం ఉత్తమమని సూచిస్తున్నారు. శాస్త్రీయంగా మాత్రం వీటికి ఏ ఆధారాలు లేదు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos


 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos