కరోనాను (Coronavirus) పారదోలేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown in India) విధించడంతో వివిధ కారణాలతో హైదరాబాద్‌లో ఉండటం ఇష్టంలేని వాళ్లు సొంతుళ్లకు వెళ్లే ప్రయత్నం చేసి పోలీసుల చేతిలో భంగపాటుకు గురై వెనుతిరిగొస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా సొంతూరి మకాంపట్టిన కొంతమంది ఏపీ వాసులకు సైతం ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. గురువారం నాడు ఏపీలోని తమ స్వస్థలాలకు వెళ్లాలని బయల్దేరిన కొంతమందిని దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలోని తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలిసులు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి NOC తీసుకుని వస్తున్నామని.. తమని ఆంద్రప్రదేశ్‌లోకి అనుమతించాల్సిందిగా సదరు వాహనదారులు కోరారు. అయినప్పటికీ పోలీసులు వినిపించుకోకపోవడంతో ఆగ్రహించిన వాహనదారులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వాహనదారుల రాళ్లదాడిలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : COVID-19: కరోనాపై యుద్ధానికి మెఘా క్రిష్ణా రెడ్డి భారీ విరాళం.. ఎవరెవరు ఎంతిచ్చారంటే..


వాహనదారులు రాళ్లు రువ్వుతుండటంతో ఏం చేయాలో అర్థం కాని పోలీసులు వెంటనే తమ వద్ద ఉన్న లాఠీలకు పనిచెప్పారు. రాళ్లదాడికి పాల్పడిన వాహనదారులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసులు తిరగబడటంతో వాహనదారుులు తమ వాహనాలను వెనక్కి తిప్పుకుని అక్కడి నుంచి పరుగులుతీశారు. ఇంకొంత మంది వాహనదారులు పోలీసుల చేతికి చిక్కారు. దీంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. తిరిగి వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆందోళనకారులకు నచ్చచెప్పారు. ఈ క్రమంలో ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..