కేటీఆర్ ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారు : నారా లోకేష్
కేటీఆర్ ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారు : నారా లోకేష్
విశాఖపట్నం: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీడీపీ అభ్యర్థులకు ఫోన్లు చేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో పాల్గొని మాట్లాడుతు మంత్రి నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. పోలవరం ముంపు మండలాలను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్‌తో కలిసి పనిచేస్తున్న జగన్ పేరును కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డిగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రికి తనయుడిగా ఉంటూనే జగన్ లక్ష కోట్లు కొట్టేశారంటే.. ఒకవేళ ఆయనే ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత ప్రజల ఒంటి మీద బంగారం కూడా వదలడని జగన్‌ని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం 120 పథకాలు ప్రవేశపెట్టిందని చెబుతూ.. మన దేశంలో ఆంధ్రప్రదేశ్‌లో తప్ప మరెక్కడా రూ.2000 వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం లేదని గుర్తుచేశారు.