TTD Darshan Tickets: తిరుమలలో భక్తుల రద్దీ భారీస్థాయిలో పెరిగింది. తిరుమల కొండపై ఎటు చూసినా భక్తసంద్రమే కనిపిస్తోంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావావడంతో భక్త జనం తిరుమలకు పోటేత్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా శ్రీవారి దర్శనానికి భక్తులు తరలివవచ్చారు. స్వామి వారి దర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంపెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి తిరమల కొండపై భారీగా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. రేపు కూడా సెలవులు కావడంతో ఇంకా ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీవారి దర్శనానికి బయట క్యూలైన్లలో బారులు తీరారు. క్యూలైన్‌లో నిల్చున్న భక్తులకు టీటీడీ అధికారులు అన్నప్రసాదాలు అందజేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠం-2లోని 33 కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.


వైకుంఠం-1లోని 16 కంపార్ట్‌మెంట్‌లో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. గంటకు 4 వేల మంది స్వామి వారిని దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెరుగుతున్న క్యూలైన్‌తో దాదాపు 4 కి.మీ మేర వరకు లైన్ పెరిగిపోయింది. నారాయణ గిరి షెడ్లు కూడా భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి మెట్ల మార్గంలో గోవిందా నామస్మరణతో మార్మోగుతుండగా.. భక్తుల సంఖ్య పెరగడంతో వసతి దొరకడం కష్టమవుతోంది. 


Also Read: Governor Protest: నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని గవర్నర్‌ ధర్నా.. మీరెందుకు అంటూ పోలీసులపై ఆగ్రహం


Also Read: Amit Shah Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. 'బిహార్‌' పరిణామాలే కారణమా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook