TTD Venkateswara swamy will not spare anyone CJI NV Ramana: టీటీడీలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ (Justice NV Ramana) వ్యాఖ్యానించారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించడం లేదంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రకాశం జిల్లాకు (Prakasam district) చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌తో జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలుగులో మాట్లాడారు. మీరు పేరు ఏమిటి ఇలా ఉందేమిటి అని పిటిషనర్‌‌ను ప్రశ్నించారు.తన పేరు శ్రీవారి దాసానుదాసుడు అని, తాను ఏలూరి శేషయ్య కుమారుడినని, అందరూ తనను శ్రీవారి దాదా (Srivari DaDa) అని పిలుస్తారని పిటిషనర్‌ చెప్పారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో అసలు పేరు ఉపయోగించాలని హితవు పలికారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తిరుమలలో పూజలు సంప్రదాయంగా జరగడం లేదంటూ పిటిషనర్‌‌ సమస్యలు ఏకరువు పెడుతుండగా.. జస్టిస్‌ ఎన్వీ రమణ ఆయన్ని నిలువరించారు. పిటిషన్‌ను జాబితాలో త్వరగా చేర్చాలని ప్రతిరోజూ రిజిస్ట్రీని బెదిరిస్తారా అని ప్రశ్నించారు జస్టిస్‌ ఎన్వీ రమణ. అయినా ఏమంత అత్యవసరం వచ్చింది.. పూజలు ఎలా నిర్వహించాలి.. ఎప్పుడు నిర్వహించాలో జోక్యం చేసుకొనే అవసరం ఏమిటి అని అన్నారు.


Also Read : Be Alert: రేపటి నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్ సేవలు బంద్


ఏ చట్ట ప్రకారం కోర్టులు జోక్యం చేసుకోవాలి.. ఇదేమైనా రాజ్యాంగ ఉల్లంఘనా.. ఎంత మందిని దర్శనానికి అనుమతించాలనే అంశంపై టీటీడీని (TTD) ప్రశ్నించడం ప్రాథమిక హక్కు కిందకు రాదని చెప్పారు జస్టిస్‌ ఎన్వీ రమణ. తనతో పాటు న్యాయమూర్తులు అందరూ శ్రీవేంకటేశ్వరస్వామి (Sri Venkateswara swamy) వారికి భక్తులే అని పూజలు సంప్రదాయంగా జరగాలనే కోరుకుంటాం అని జస్టిస్‌ ఎన్వీ రమణ (Justice NV Ramana) పేర్కొన్నారు. అయితే పిటిషనర్‌ జోక్యం చేసుకోబోగా వారిస్తూ.. శ్రీవారి భక్తులకు సహనం ఉండాలని సూచించారు.


Also Read : Viral: మిస్సయ్యాడు..చివరకు తనను తానే వెతుకున్నాడు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి