Tirumala Vaikunta Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవాస్థానం పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది మరింత ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే  జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసింది. అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనుంది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించి చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న విధంగానే ఈ ఏడాది కూడా వైకుంఠ ద్వార దర్శనం 11 రోజులపాటు కల్పించనుంది టీటీడీ. 2023 జనవరి 2వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసి.. శ్రీవాణి, ఎస్ఈడీ టిక్కెట్లు, ఎస్ఎస్డీ టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు "మహా లఘు దర్శనం" కల్పించనున్నారు. 


రూ.300 కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం దర్శనానికి సంబంధించి రోజుకు 25 వేల టికెట్లు విడుదల చేస్తారు. 10 రోజులకు కలిపి మొత్తం 2.50 లక్షల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. 2023 జనవరి కోటాలోనే ఈ టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదేవిధంగా తిరుమల స్థానిక భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతిలో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు.


వీటి ద్వారా రోజుకు 50 వేలు చొప్పున మొత్తం ఐదు లక్షల ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయనున్నారు. స్థానికులు కచ్చితంగా ఆధార్ కార్డ్ చూపించి ఈ టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్డీ టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్‌లుగా విభజించి జేఈఓలు  పర్యవేక్షిస్తారు. 


వైకుంఠ ద్వార దర్శనం 11 రోజులపాటు సిఫార్సు లేఖలకు తీసుకోమని టీటీడీ అధికారులు ఇప్పటికే తెలిపారు. రోజుకు 2 వేల చొప్పున శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తెలిపారు. ప్రతిరోజూ 2 వేల మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయించనున్నారు. 


వైకుంఠ ద్వార దర్శాననికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో వసతి ఏర్పాట్లపై కూడా టీటీడీ అధికారులు దృష్టిపెట్టారు. న్యూఇయర్, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా ఈ నెల 29 నుంచి జనవరి 3 వరకు వసతి అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేశారు. మరికొన్ని కౌంటర్లు పెంచి సీఆర్వోలో మాత్రమే గదులు కేటాయించనున్నారు. జనవరి 2వ తేదీన తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుంది. జనవరి 3న వైకుంఠ ద్వాదశి రోజున స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటిలో సుదర్శన చక్రత్తాళ్వార్ స్నపనం అనంతరం చక్రస్నానం చేస్తారు. 


Also Read: Rain Alert For AP: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు


Also Read: Adi Seshagiri Rao: వైసీపీ నుంచి బయటకు రావడానికి కారణం అదే.. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి