Amarnath Tragedy: భయపడుతున్నట్లే జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్ నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతైన వారిలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు మహిళా భక్తులు చనిపోయినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి 20 మంది అమర్ నాథ్ యాత్ర వెళ్లారు. శుక్రవారం ఆకస్మికంగా వచ్చిన వరదలతో వాళ్లంతా చెల్లాచెదురయ్యారు. వరదలు వచ్చిన సమయంలో టెంట్లు కొట్టుకుపోయిన ప్రాంతంలోనే ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా భక్తులు. వరదలు రావడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ఎవరికివారు అక్కడినుంచి పారిపోయారు. అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి వెళ్లిన 20 మంది యాత్రికుల్లో ఇద్దరి ఆచూకి గల్లంతైందని ఆదివారం గుర్తించారు. మిలిగిన 18 మంది సురక్షితంగా ఉన్నారని రెవిన్యూ అధికారులు ప్రకటించారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గల్లంతైన ఇద్దరు క్షేమంగా ఉండాలని వాళ్ల బంధువులు, స్థానికులు ప్రార్థనలు చేశారు.అయితే వాళ్ల ప్రార్థనలు ఫలించలేదు. వరదల సమయంలో గల్లంతైన ఇద్దరు యాత్రికులు చనిపోయారు. రాజమండ్రికి చెందిన సుధ, మరో మహిళ పార్వతి మృతి చెందారని అమర్ నాథ్ నుంచి స్థానిక అధికారులకు సమాచారం వచ్చింది. స్థానిక అధికారులు ఈ విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు చేరవేశారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వరదల్లో  చనిపోయిన కొత్త పార్వతి, మునిశెట్టి సుధలది రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మ పేట. రెస్క్యూ టీమ్స్ వెలికితీసిన పార్వతి మృతదేహం ఢిల్లీ ఎయిమ్స్‌లో ఉందని ఏపీ అధికారులు చెప్పారు. సోమవారం ఉదయం శ్రీనగర్‌ మార్చురీలో ఉన్న మృతదేహాలను గుర్తించే సమయంలో సుధ శవాన్ని ఆమె భర్త గుర్తించారు. ఇద్దరి మృతి దేహాలను ఏపీకి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రిలో బాధిత కుటుంబాలతో  ఆర్డీఓ మాట్లాడారు.


తూర్పుగోదావరి జిల్లా నుంచి వెళ్లిన మిగిలిన యాత్రికులు ప్రస్తుతం శ్రీనగర్‌-జమ్మూ బేస్‌ క్యాంప్‌లో ఉన్నారు. ఏపీ నుంచి అమర్‌ నాథ్‌ కు వెళ్లిన  20 మంది యాత్రికులు ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చారు. అక్కడినుంచి స్వస్థలాలకు  వెళ్లారు. మరో 18 మంది సోమవారం ఉదయం రైలులో చండీగఢ్‌ నుంచి విజయవాడకు వచ్చారు. విజయవాడ నుంచి సొంతూర్లకు తరలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.ఏపీ నుంచి అమర్ నాథ్ వెళ్లిన యాత్రికులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం నుంచి ఎంతమంది వెళ్లారు.. ఇప్పుడెక్క ఉన్నారు అన్న విషయాలను అధికారులు ఆరా తీశారు. ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. యాత్రకు వెళ్లిన వారి బంధువుల నుంచి వివరాలు తీసుకుని.. ఫోన్ నెంబర్లు సేకరించి వాళ్లతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేసి సొంతూర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.


Read also: TS EAMCET: తెలంగాణ ఎంసెట్ వాయిదా?


Read also: తమ్ముడి శవాన్ని ఒడిలో పెట్టుకుని.. అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్న 8 ఏళ్ల అన్న! కనీళ్లు పెట్టిస్తున్న వీడియో  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook