విషాదం.. ఆడుకుంటూ బావిలో పడ్డ చిన్నారులు మృతి
ఆట.. విషాదాన్ని నింపింది. సరదాగా ఆడుకుంటున్న చిన్నారులు బావిలో పడి చనిపోయారు. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు పొరపాటున బావిలో పడి మృతిచెందారు. జిల్లాలోని జేవీ పురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుసుకుంది. ఆడుకుంటున్న చిన్నారులు బావిలో పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో వారిని కాపాడలేకపోయారని తెలిపారు. అయితే ఎవరైనా చిన్నారులను బావిలో తోసేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ