Vizag Steel plant: సొంతంగా గనులు లేకపోవడమే కారణమని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం
Vizag Steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి పార్లమెంట్‌లో చర్చకొచ్చింది. సొంత ఇనుప ఖనిజం గనులు లేకపోవడమే విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాలకు కారణమని కేంద్రం అంగీకరించింది. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
Vizag Steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి పార్లమెంట్‌లో చర్చకొచ్చింది. సొంత ఇనుప ఖనిజం గనులు లేకపోవడమే విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాలకు కారణమని కేంద్రం అంగీకరించింది. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు నినాదంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవెటీకరణ(Vizag steel plant privatisation) కానుండటం రాష్ట్రంలో ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు సంఘీభావంగా మద్దతిస్తున్నాయి. విశాఖ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ...విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గేది లేదని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitaraman)స్పష్టం చేయడం విశాఖ ఉక్కు ఆందోళనను మరింత ఉధృతం చేసింది. ఇదే అంశంపై ఇవాళ పార్లమెంట్‌లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
సొంత ఇనుప ఖనిజం గనులు(Captive mines)లేకపోవడమే విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాలకు కారణమని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Minister Dharmendra pradhan) రాజ్యసభలో వెల్లడించారు. సొంత ఇనుప ఖనిజం గనులు లేకపోవడంతో విశాఖ స్టీల్‌ప్లాంట్ బహిరంగ మార్కెట్లో ఇనుప ఖనిజం కొనుగోలు చేయవలసి వస్తోందని..ఫలితంగా నష్టాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇనుప ఖనిజం గనులను రిజర్వ్ చేయవలసిందిగా కేంద్రంలోని గనుల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయవలసిందిగా విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఒడిషా, చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. దీంతో విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం ఇనుప ఖనిజం గనిని రిజర్వ్ చేయవలసిందిగా గనుల మంత్రిత్వ శాఖ ఒడిషా ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.
ఒడిషాలోని థాకురాని బ్లాక్ ఏ, రమణదుర్గ ఫారెస్ట్ రేంజ్‌లో బ్లాక్ 31లోని ఇనుప ఖనిజం గనులను 2004,2019లో సెయిల్ పేరిట రిజర్వ్ చేసినందున ఒడిషా ప్రభుత్వం మూడేళ్ళ పాటు ఆయా బ్లాకుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. బొగ్గు మంత్రిత్వ శాఖ 2020 మార్చిలో జార్ఘండ్‌లోని రబోధి కోల్ గనిని విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు సూత్రప్రాయంగా కేటాయించిందని కూడా కేంద్ర మంత్రి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook