Vizag steel plant privatisation: ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గేది లేదంటున్న కేంద్ర ప్రభుత్వం
Vizag steel plant privatisation: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓ వైపు ఉద్యమం కొనసాగుతోంది. మరోవైపు ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది.
Vizag steel plant privatisation: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓ వైపు ఉద్యమం కొనసాగుతోంది. మరోవైపు ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ అంశం వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ(Vizag steel plant privatisation). కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ వైపు ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వం(Central government)మరోసారి స్పష్టత ఇచ్చింది. రెండవ విడత బడ్దెట్ సమావేశాల ప్రారంభమైన సమయంలో విశాఖపట్నం అధికారపార్టీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణ విషయంలో తాము తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేస్తామని, స్టీల్‌ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి ఏ విధమైన సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు.
స్టీల్‌ప్లాంట్‌లో 100% పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లుగా చెప్పిన నిర్మల సీతారామన్( Union minister nirmala sitaraman)..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి(Ap government) విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఈక్విటీ షేర్ లేదని కూడా స్పష్టం చేశారు. మెరుగైన ఉత్పాదకత కోసమే ప్రైవేట్‌పరం చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఆందోళనకు బహిరంగంగానే మద్దతిస్తున్నారు. మోదీ ప్రభుత్వం(Modi government) తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేవరకూ పోరాటం కొనసాగించాలని ఉద్యమకారులు యోచిస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వైఖరి స్పష్టం చేయడంతో..వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన ఉధృతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో బీజేపీ(BJP)కు ఇరకాటంగా మారనుంది.
Also read: E Watch app: ఈ వాచ్ యాప్‌ను పూర్తిగా నిలిపివేస్తూ..తుది ఆదేశాలిచ్చిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook