Union minister Shivraj Singh and Chandrababu on Floods: విజయవాడ వరదల పరిస్థితిని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి, కేంద్ర మంత్రి చంద్రశేఖర్, రాష్ట్రమంత్రులు నారా లోకేశ్, అనిత, అచ్చెన్నాయుడుతో కలిసి వరద విపత్తుపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి మీడియాతో మాట్లాడారు. వరద నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రానున్న కాలంలో ప్రకాశం బ్యారేజ్ సామర్ధ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌లో 12 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చిందని..15 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కరకట్ట ఆక్రమణలు తొలగించాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ సామర్ధ్యం పెంపు విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర నిపుణులతో చర్చిస్తామన్నారు. 


అటు బుడమేరు వాగు వద్ద ఆక్రమణలు పెరిగిపోయాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. కృష్ణా నది, బుడమేరు కరకట్టలు పటిష్టం చేస్తామన్నారు. బుడమేరు వాగుకు ఏర్పడిన గండ్లను ఆర్మీ సహాయంతో పూడుస్తామన్నారు. బుడమేరు స్థాయికి మించిన వరద కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని చంద్రబాబు తెలిపారు. అందుకే శివారు ప్రాంతాలు నీట మునిగాయన్నారు. బుడమేరును బ్రిటీష్ హయాంలో 10-11 వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో నిర్మించగా ఇప్పుడు ఏకంగా 35 వేల క్యూసెక్కుల నీరు వచ్చిందన్నారు. ఆ వరద అంతా విజయవాడపై పడిందన్నారు. 


Also read: AP Heavy Rains: ఇవాళ్టి నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.